ఈ నెల 28న విడుదల కానున్న రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్


Thu,August 23, 2018 03:29 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, మొబైల్స్ తయారీదారు ఒప్పోల సంయుక్త భాగస్వామ్యంలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బ్రాండ్ కింద రియల్‌మి 1 ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నారు.

ఈ నెల 28వ తేదీన రియల్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు రియల్‌మి తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపింది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో రెండు కెమెరాలు, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే రియల్‌మి 2కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలను మాత్రం రియల్ మి ఇంకా వెల్లడించలేదు. మరో రెండు రోజుల్లో ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

3195

More News

VIRAL NEWS