ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన రియల్ మి 2 స్మార్ట్‌ఫోన్


Sun,September 2, 2018 12:23 PM

ఒప్పో, అమెజాన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నెలకొల్పబడిన రియల్ మి బ్రాండ్ కింద మరో స్మార్ట్‌ఫోన్ తాజాగా విడుదలైంది. రియల్ మి 2 పేరిట ఈ ఫోన్ విడుదలైంది. రియల్ మి 1 ఫోన్‌కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.8,990, రూ.10,990 ధరలకు వినియోగదారులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రియల్ మి 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో 4230 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు.

రియల్ మి 2 ఫీచర్లు...


6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

5035

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles