నిమిషాల వ్య‌వ‌ధిలోనే 2.1 ల‌క్ష‌ల రియ‌ల్ మి 3 ఫోన్ల విక్ర‌యం


Wed,March 13, 2019 04:31 PM

ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియ‌ల్ మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్ మి 3 ని ఇటీవలే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌కు గాను ఫ్లిప్‌కార్ట్‌లో తాజాగా నిర్వ‌హించిన సేల్ కు వినియోగ‌దారుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. దీంతో ఆ సేల్‌లో నిమిషాల వ్య‌వ‌ధిలోనే 2.1 ల‌క్ష‌ల రియ‌ల్ మి 3 ఫోన్లు అమ్ముడ‌య్యాయి. కాగా ఇదే విష‌యాన్ని రియ‌ల్‌మి మొబైల్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ ద్వారా తెలిపింది. ఇక ఈ ఫోన్‌కు గాను తదుప‌రి సేల్‌ను ఈ నెల 19వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నిర్వ‌హిస్తున్నామ‌ని రియ‌ల్ మి మొబైల్స్ తెలిపింది. కాగా రియ‌ల్ మి 3 ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.7499 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8499 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.

1741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles