రేజర్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,October 11, 2018 11:40 AM

మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 ను తాజాగా అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో విడుదల చేసింది. త్వరలో ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. రూ.59,450 ధరకు ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రేజర్ ఫోన్2లో 5.72 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

రేజర్ ఫోన్ 2 ఫీచర్లు...


5.72 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్.

1179

More News

VIRAL NEWS

Featured Articles