వ‌చ్చేస్తుంది.. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో జాంబీ మోడ్‌..!


Sat,February 16, 2019 06:51 PM

ప‌బ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. వారు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న జాంబీ మోడ్ ఎట్టకేల‌కు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో ల‌భ్యం కానుంది. ఈ నెల 19వ తేదీన ఈ మోడ్‌కు చెందిన‌ అప్‌డేట్ విడుద‌ల‌వుతుంద‌ని గేమ్ డెవ‌ల‌ప‌ర్ కంపెనీ టెన్సెంట్ గేమ్స్ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే ప‌బ్‌జి మొబైల్ గేమ్ కొత్త అప్‌డేట్‌ను ఆ రోజున ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ మోడ్‌లో ప్లేయ‌ర్లు రెండు నైట్ల‌లో జాంబీల‌ను, జాంబీ బాస్‌ల‌ను చంపాల్సి ఉంటుంది. జాంబీ కిల్స్‌తో వ‌చ్చే రివార్డుల‌తో గ‌న్ స్కిన్స్‌, ఇత‌ర స‌దుపాయాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక కొత్త అప్‌డేట్‌లో వికెండి మ్యాప్‌లో మూన్‌లైట్‌వెద‌ర్‌ను యాడ్ చేశారు. ఇక మెనూ థీమ్‌, మ్యూజిక్ రెసిడెంట్ ఈవిల్ 2 ను పోలి ఉంటుంది. ఆర్కేడ్ మోడ్‌లో స‌న్‌హోక్ మ్యాప్‌ను అందిస్తున్నారు. అందులో క్విక్ మ్యాచ్ ఆడ‌వ‌చ్చు. సెట్టింగ్స్ లో షాడోస్‌ను డిసేబుల్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించారు. గ‌తంలో ప్లేయ‌ర్లు ఆడిన మ్యాచ్‌ల‌కు చెందిన రిజ‌ల్ట్స్ ఇక‌పై కేవ‌లం ఒక నెల వ‌ర‌కే అందుబాటులో ఉంటాయి. అలాగే గేమ్ ఆడుతున్న‌ప్పుడు వ‌చ్చే ల్యాగ్‌ను నివారించేందుకు కొన్ని బ‌గ్స్ ను కూడా ఫిక్స్ చేశారు.


4264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles