ప‌బ్‌జి మొబైల్ జాంబీ మోడ్ అదుర్స్‌..!


Tue,February 19, 2019 05:10 PM

ప‌బ్‌జి మొబైల్ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న జాంబీ మోడ్ వ‌చ్చేసింది. ఇవాళే ఈ మోడ్ అప్ డేట్‌ను విడుద‌ల చేశారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు ఈ అప్‌డేట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ జాంబీ మోడ్‌లో ప‌లు కొత్త వెప‌న్ల‌తోపాటు ముందు చెప్పిన‌ట్లుగా ఈవెంట్ మోడ్‌లో జాంబీల‌ను చంపే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. గేమ‌ర్లు రెండు నైట్ల‌లో జాంబీల‌ను చంపి స‌ర్‌వైవ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది లిమిటెడ్ టైమ్ ఈవెంట్ మోడ్‌లో మాత్ర‌మే ల‌భిస్తున్న‌ది.

ప‌బ్‌జి మొబైల్ గేమ్ లో కొత్తగా వ‌చ్చిన జాంబీ మోడ్ అప్‌డేట్‌లో వికెండి మ్యాప్‌లో మూన్‌లైట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే కొత్త‌గా ప్లేయ‌ర్ స్పేసెస్ అనే మ‌రో ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు రెసిడెంట్ ఈవిల్ 2 మెయిన్ మెనూ థీమ్‌, మ్యూజిక్‌, నూత‌న ఇమోట్స్, అవతార్లు, ఫ్రేములు, స‌న్‌హోక్ ఆర్కేడ్ క్విక్ మ్యాచ్ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను ఈ కొత్త అప్ డేట్‌లో అందిస్తున్నారు. ఇక ఈ అప్ డేట్‌ను ఆడిన ప‌లువురు ప్ర‌ముఖ యూట్యూబ్ స్ట్రీమ‌ర్లు జాంబీ మోడ్ బాగుంద‌ని కితాబిస్తున్నారు. అంతేకాకుండా ప‌బ్‌జి గేమ్ ప్రియులు కూడా ఈ జాంబీ మోడ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles