పబ్‌జి మొబైల్ వికెండి స్నో మ్యాప్ వచ్చేసింది..!


Thu,December 20, 2018 12:48 PM

పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడుతున్న గేమింగ్ ప్రియులకు శుభవార్త. వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వికెండి స్నో మ్యాప్ అప్‌డేట్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై పబ్‌జి ఆడే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ సైజ్ 134 ఎంబీ ఉండగా, ప్రస్తుతం డౌన్‌లోడ్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. కానీ గేమ్ ప్లే మాత్రం రేపు ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇక పబ్‌జి గేమ్‌ను ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా (చైనా తప్ప) 200 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌లో నిత్యం 30 మిలియన్ల మంది డెయిలీ యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. పబ్‌జి మొబైల్‌కు చైనా, భారత మార్కెట్‌లలో మంచి ఆదరణ లభిస్తుందని ఆ గేమ్ డెవలపర్ సంస్థ టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది. తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ గేమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుండడం తమకు లాభించిందని, అందుకే చాలా మంది ఈ గేమ్‌ను ఆడుతున్నారని, దీంతో గేమ్‌కు పాపులారిటీ బాగా లభిస్తుందని టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది. ఇక భారత్‌లో పబ్‌జి గేమ్‌ను మొబైల్, పీసీ ప్లాట్‌ఫాంలపై ఎక్కువగా ఆడుతున్నారని కూడా ఆ కంపెనీ తెలిపింది.

1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles