రేప‌టి నుంచే ప‌బ్‌జి మొబైల్ రాయ‌ల్ పాస్ సీజ‌న్ 6.. కొత్త ఫీచ‌ర్లివే..!


Tue,March 19, 2019 12:14 PM

ప‌బ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల్ పాస్ సీజ‌న్ 5 లో మునిగి తేలిన గేమింగ్ ప్రియులు ఇక సీజ‌న్ 6 లో ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే.. సీజ‌న్ 5 ఇప్ప‌టికే ముగియ‌గా, రేప‌టి నుంచే సీజ‌న్ 6 ప్రారంభం కానుంది. ఈ మేర‌కు ప‌బ్‌జి మొబైల్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ టెన్సెంట్ గేమ్స్ ఇవాళ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందులో సీజన్ 6 లో యూజ‌ర్ల‌కు ల‌భించే ఫీచ‌ర్ల‌ను వివ‌రించారు.

ప‌బ్‌జి మొబైల్ రాయ‌ల్ పాస్ సీజ‌న్ 6 రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని టెన్సెంట్ గేమ్స్ తెలిపింది. ఇక ఈ సారి స‌ర్వ‌ర్లను ఆఫ్‌లైన్‌లో పెట్ట‌కుండా నేరుగానే అప్‌డేట్‌ను పుష్ చేయ‌నున్నారు. అలాగే ప‌బ్‌జి మొబైల్ గేమ్ మొద‌టి యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా ప‌లు గిఫ్ట్‌ల‌ను కూడా సీజ‌న్ 6 లో యూజ‌ర్ల‌కు అందివ్వ‌నున్నారు. అందుకు గాను యూజ‌ర్లు సీజ‌న్ 6 లో గేమ్ ఆడేట‌ప్పుడు ప‌లు ప్ర‌త్యేక కేక్‌ల‌ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక సీజ‌న్ 6లో కొత్త‌గా G36C పేరిట ఓ నూత‌న వెప‌న్‌ను ఏర్పాటు చేశారు. 5.56 ఎంఎం బుల్లెట్ల‌ను ఈ వెప‌న్‌లో ఉప‌యోగించాల్సి ఉంటుంది. అలాగే ఈ గ‌న్‌కు స్కోప్‌, థంబ్ గ్రిప్‌, లేజర్ సైట్ ల‌ను అమ‌ర్చుకోవ‌చ్చు. ఇక ఈ సీజ‌న్‌లో ఎం762 రైఫిల్‌కు స్కిన్‌ల‌ను అందివ్వ‌నున్నారు. అయితే G36C గ‌న్ కేవ‌లం వికెండి మ్యాప్‌లోనే ల‌భిస్తుంది. SCAR-L స్థానంలో ఈ గ‌న్‌ను అందిస్తారు. అలాగే కొత్త సీజ‌న్‌లో ఎరాంగిల్‌, మిరామార్ మ్యాప్‌ల‌లోనూ డైన‌మిక్ వెద‌ర్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు సీజ‌న్ 6 లో కొత్త‌గా ఆటోను చేర్చారు. సాన్‌హోక్ మ్యాప్‌లో యూజ‌ర్లు ఆటోలో వెళ్ల‌వ‌చ్చు. ముగ్గురు అందులో ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇండియ‌న్ గేమింగ్ ప్రియుల‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త‌గా ఆటోను ఆ మ్యాప్‌లో చేర్చారు.

రాయ‌ల్ పాస్ సీజ‌న్ 6 లో జాంబీ మోడ్ ను ఎప్పుడంటే అప్పుడు ఆడ‌లేరు. కేవ‌లం వీకెండ్స్‌లో మాత్ర‌మే ఆడ‌వ‌చ్చు. అది కూడా నిర్దిష్ట‌మైన స‌మ‌యంలోనే జాంబీ మోడ్ అందుబాటులో ఉంటుంది. ఇక గేమ్‌ను ల్యాగ్ లేకుండా ఆడుకునేందుకు అందులో ఉన్న ప‌లు బ‌గ్స్‌ను ఫిక్స్ చేశారు. దీంతో ఈ కొత్త సీజ‌న్‌లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను కొంత వ‌ర‌కు ల్యాగ్ లేకుండా ఆడుకోవ‌చ్చు. అలాగే రేపటి నుంచి ఆరంభం కానున్న సీజ‌న్ 6 లో మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందివ్వ‌నున్నారు. ఇక ఏప్రిల్ నెల‌లో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో కొత్త‌గా స‌బ్‌స్క్రిప్షన్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ప్రైమ్‌, ప్రైమ్ ప్ల‌స్ పేరిట నెల‌వారీ ప్లాన్ల‌ను అందుబాటులోకి తేనున్నారు. వీటితో రోజూ ఉచితంగా యూసీ క్యాష్‌, రివార్డులు అద‌నంగా ల‌భిస్తాయి.

1401

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles