ప‌బ్‌జి మొబైల్ రాయ‌ల్ పాస్ సీజ‌న్ 5 వచ్చేసింది..!


Sat,January 19, 2019 02:48 PM

ప‌బ్‌జి మొబైల్ గేమ్ ప్రియుల‌కు శుభవార్త‌. ఈ నెల 17వ తేదీన రాయ‌ల్ పాస్ సీజ‌న్ 4 ముగియ‌గా ప్ర‌స్తుతం సీజ‌న్ 5 యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సీజ‌న్‌తోపాటు అందిస్తున్న అప్‌డేట్ (0.10.5)లో కొత్త‌గా ఎంకే47 మ్యుటంట్ గ‌న్‌, లేజ‌ర్ సైట్ ను అందిస్తున్నారు. ఎంకే 47 గ‌న్‌ను ఎరాంజిల్‌, మిరామ‌ర్‌, స‌న్‌హోక్ మ్యాప్‌ల‌లో పొంద‌వ‌చ్చు. దీనికి 7.62 ఎంఎం బుల్లెట్స్ వ‌స్తాయి. దీనికి రెండు ర‌కాల ఫైరింగ్ మోడ్స్‌ను అందిస్తున్నారు. ఇక లేజ‌ర్ సైట్‌ను ప‌లు గ‌న్‌ల‌కు అటాచ్‌మెంట్‌గా ఫిట్ చేసుకోవ‌చ్చు. ఈ సైట్‌ను అమ‌రిస్తే గ‌న్ నుంచి లేజ‌ర్ లైట్ గ్రీన్ క‌ల‌ర్ లో వ‌స్తుంది. ఇక యూజ‌ర్లు వికెండి మ్యాప్‌లోనూ క‌స్ట‌మ్ రూమ్‌ల‌ను ప్ర‌స్తుతం ఈ కొత్త అప్‌డేట్‌లో క్రియేట్ చేసుకోవ‌చ్చు. రాయ‌ల్ పాస్ సీజ‌న్ 5లో ఆర్‌పీ 100కు చేరుకుంటే రెండు ర‌కాల సూట్‌ల‌లో ఏదో ఒక ప్రీమియం సూట్‌ను యూజ‌ర్లు సొంతం చేసుకోవ‌చ్చు. ఇక వీటితోపాటు ప‌లు ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ప‌బ్‌జి మొబైల్ కొత్త అప్‌డేట్ లో యూజ‌ర్ల‌కు అందిస్తున్నారు. అయితే యూజ‌ర్లు ప్లే స్టోర్‌లో కాకుండా గేమ్ ప్రారంభం అయ్యాక ఆటోమేటిక్‌గా వ‌చ్చే అప్‌డేట్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటేనే గేమ్ కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ అవుతుంది.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles