ప‌బ్‌జి మొబైల్ కొన‌సాగుతుంది.. బ్యాన్ వార్త అబ‌ద్ధం..!


Thu,December 27, 2018 11:08 AM

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌లో గ‌త కొద్ది రోజులుగా ప‌బ్‌జి మొబైల్ గేమ్ బ్యాన్ అవుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే క‌దా. ప‌బ్‌జి మొబైల్ గేమ్ హింస‌ను ప్రేరేపిస్తుంద‌ని, అనేక మంది విద్యార్థులు ప‌బ్‌జికి వ్య‌స‌న‌ప‌రులుగా మారి జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌ని, అందుక‌నే జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఆ గేమ్‌పై భార‌త్‌లో నిషేధం విధిస్తున్నామ‌ని.. మ‌హారాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి కె.శ్రీ‌నివాసులు పేరిట సృష్టించ‌బ‌డిన ఓ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది.

అయితే అచ్చం కోర్టు ఇచ్చిన‌ట్లుగానే ఆ లెట‌ర్ ఉండ‌డంతో చాలా మంది అది నిజ‌మేన‌ని నమ్మి, ప‌బ్‌జి గేమ్ ఇండియాలో బ్యాన్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ ఆ లెట‌ర్ న‌కిలీద‌ని, అందులో అన్నీ గ్రామ‌ర్ త‌ప్పులు ఉన్నాయ‌ని, కోర్టు ఆ లెట‌ర్‌ను జారీ చేయ‌లేద‌ని.. ఓ ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ చేప‌ట్టిన ప‌రిశీల‌న‌తో తెలిసింది. కాగా ప‌బ్‌జి గేమ్ డెవ‌ల‌ప‌ర్ టెన్సెంట్ గేమ్స్ ఇంకా ఈ విష‌యంపై స్పందించ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఇలాంటి న‌కిలీ వార్త‌లు, పుకార్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


నెట్‌లో వైరల్ అవుతున్న న‌కిలీ లెట‌ర్ ఇదే..!

2188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles