ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్‌లకు భారత్‌లో ప్రీ ఆర్డర్లు షురూ..!


Sat,September 22, 2018 02:52 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లకు గాను భారత్‌లో ప్రీ ఆర్డర్లను ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ నుంచి భారత్‌లో ఈ నూతన ఐఫోన్లు లభ్యం కానున్న నేపథ్యంలో యూజర్ల కోసం ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. నిన్నటి నుంచే ఈ ఐఫోన్లు 30 దేశాల్లో అందుబాటులో రాగా, మరో వారం రోజుల్లో మరో 25 దేశాల్లో ఈ ఐఫోన్లు లభ్యం కానున్నాయి.

ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్ ఫోన్లను భారత్‌లోని యూజర్లు ఫ్లిప్‌కార్ట్, ఎయిర్‌టెల్, జియో ఆన్‌లైన్ స్టోర్స్‌లో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,500 వరకు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్టులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే ఎయిర్‌టెల్ స్టోర్‌లో సిటీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ప్రీ ఆర్డర్ చేస్తే పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. రిలయన్స్ జియో స్టోర్‌లో నూతన ఐఫోన్లను ప్రీ ఆర్డర్ చేస్తే 3-5 రోజుల్లో ఫోన్లను డెలివరీ చేస్తారు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొంటే 5ఎక్స్ రివార్డు పాయింట్లు లభిస్తాయి.

యాపిల్ ఐఫోన్ Xఎస్ 64 జీబీ ధర రూ.99,900 ఉండగా, 256 జీబీ వేరియెంట్ ధర రూ.1,14,900, 512 జీబీ వేరియెంట్ ధర రూ.1,34,900 గా ఉంది. అలాగే యాపిల్ ఐఫోన్ Xఎస్ మ్యాక్స్ 64 జీబీ ధర రూ.1,09,900 ఉండగా, 256 జీబీ వేరియెంట్ ధర రూ.1,24,900, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.1,44,900 గా ఉంది.

1639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles