రూ.699 కే పోర్ట్రోనిక్స్ కొత్త ల్యాప్‌టాప్ స్టాండ్


Sun,February 10, 2019 05:59 PM

పోర్ట్రోనిక్స్ కంపెనీ మై బ‌డ్డీ హెగ్జా పేరిట ఓ నూత‌న ల్యాప్‌టాప్ స్టాండ్‌ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ స్టాండ్‌పై ల్యాప్‌టాను ఉంచుకుని దానిపై వ‌ర్క్ చేస్తే మెడ‌పై ఎలాంటి భారం ప‌డకుండా ఉంటుంది. దీని వ‌ల్ల స‌హ‌జంగా కంప్యూట‌ర్ ఎదుట కూర్చుంటే వ‌చ్చే మెడ‌, భుజాల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఈ స్టాండ్‌ను 7 ర‌కాల యాంగిల్స్‌లో మ‌న‌కు అనువుగా అమ‌ర్చుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ల్యాప్‌టాప్ కీబోర్డుపై టైప్ చేసేట‌ప్పుడు వేళ్ల‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. ఇక ఈ స్టాండ్‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన వెంటిలేష‌న్ వ‌చ్చేలా ఏర్పాటు చేశారు. అందుక‌ని ఇందులో ఫ్యాన్ లేదు. ఇక 13 నుంచి 15 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న ల్యాప్‌టాప్‌ల‌ను ఈ స్టాండ్‌పై అమ‌ర్చుకోవ‌చ్చు. స్టాండ్‌పై ఉండే యాంటీ స్లిప్ ర‌బ్బర్ ల్యాప్‌టాప్ జారిపోకుండా చేస్తుంది. ఇక ఈ స్టాండ్ రూ.699 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.649 ధ‌ర‌కు ఈ స్టాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

4141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles