రూ.1,999 కే పోర్ట్రోనిక్స్ మఫ్స్ జి వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్


Sat,December 15, 2018 07:19 PM

పోర్ట్రోనిక్స్.. మఫ్స్ జి పేరిట నూతన వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. బ్లూటూత్ 4.2 టెక్నాలజీతో ఈ హెడ్‌ఫోన్స్ పనిచేస్తాయి. అత్యంత ఎక్కువ కాలం మన్నేలా ఈ హెడ్‌ఫోన్స్‌ను నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేశారు. ఈ హెడ్‌ఫోన్స్‌లో 40ఎంఎం డ్రైవర్ యూనిట్ ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. 10 మీటర్ల దూరం వరకు ఈ హెడ్‌ఫోన్స్ పనిచేస్తాయి. ఒక సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ ఫుల్ చార్జింగ్ అయ్యేందుకు 2 గంటల సమయం పడుతుంది. రూ.1,999 ధరకు ఈ హెడ్‌ఫోన్స్ లభిస్తుండగా, ఆన్‌లైన్‌లో లాంచింగ్ ఆఫర్లతో రూ.1599కే ఈ హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.

3016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles