ఓపెన్ సేల్‌లో లభిస్తున్న పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్..!


Sun,September 16, 2018 07:01 PM

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 ను గత నెలలో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను షియోమీ ఆగస్టు 29వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫ్లాష్ సేల్‌లో విక్రయాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే మొదటి ఫ్లాష్ సేల్‌లో కేవలం 5 నిమిషాల్లోనే రూ.200 కోట్ల విలువైన పోకో ఎఫ్1 ఫోన్ అమ్మకాలు జరిగాయని షియోమీ వెల్లడించింది. కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను ప్రస్తుతం ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నట్లు షియోమీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు ఓపెన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియెంట్ ధర రూ.23,999 గా ఉంది.

పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌కు అధికంగా డిమాండ్ ఉంది. దీంతో ఈ వేరియెంట్‌ను మాత్రం ఫ్లాష్ సేల్‌లో విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.18 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

8324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles