షియోమీ కొత్త ఫోన్ పోకో ఎఫ్1.. అదుర్స్..!


Wed,August 22, 2018 03:27 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. ఈ ఫోన్‌లో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయం కల్పించారు. కేవలం 0.4 సెకన్ల వ్యవధిలోనే దీంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

పోకో ఎఫ్1 ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఈ ఫోన్‌లో లభిస్తున్నది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్‌కు చెందిన పలు వేరియెంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.20,999
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999
* 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999
* 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్, కెవ్లార్ ఆర్మర్డ్ ఎడిషన్ - రూ.29,999

ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో నిర్వహించనున్న ఫ్లాష్‌సేల్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఈ ఫోన్‌పై జియో 6 టీబీ వరకు అదనపు డేటాను ఉచితంగా ఇస్తున్నది. అలాగే రూ.8వేల విలువైన ఇన్‌స్టంట్ బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు...


6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

5333

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles