ప‌బ్‌జి గేమ్ ఆడండి.. రూ.1 కోటి గెలుచుకోండి..!


Sat,January 12, 2019 07:07 PM

ఇండియాలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా యువ‌త‌, పిల్ల‌లు ప‌బ్‌జి మొబైల్ గేమ్ పాట‌ను ఆల‌పిస్తున్నారు. న‌లుగురు విద్యార్థులు క‌లిస్తే ఒక‌ప్పుడు వాట్సాప్ సంభాష‌ణ‌లు, సోష‌ల్ మీడియా కాల‌క్షేపం జ‌రిగేది. కానీ ఇప్పుడు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌లో ప‌డి త‌ల‌మున‌కలై పోతున్నారు. ఇక గేమ్‌కు మ‌రింత పాపులారిటీ పెంచ‌డం కోసం ఆ గేమ్ సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌బ్‌జి టోర్న‌మెంట్ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్న‌ది. అందులో భాగంగానే త్వ‌ర‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో ప‌బ్‌జి మొబైల్ క్యాంప‌స్ చాంపియ‌న్‌షిప్ ను నిర్వహించ‌గా దానికి ప‌బ్‌జి గేమ్ ప్రియుల నుంచి అపూర్వ‌మైన స్పంద‌న ల‌భించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెన్సెంట్ గేమ్స్ కంపెనీ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోతో క‌లిసి త్వ‌ర‌లో ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019ను నిర్వ‌హించ‌నుంది. ఇందులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. అందుకు గాను ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఈ రిజిస్ట్రేష‌న్ల‌కు గ‌డువుంది. ఇక‌ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఇన్ గేమ్ క్వాలిఫైర్స్ న‌డుస్తాయి. త‌రువాత ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 24 వ‌ర‌కు ఆన్‌లైన్ ప్లే ఆఫ్స్ ఉంటాయి. త‌రువాత మార్చి 10వ తేదీన గ్రాండ్ ఫైన‌ల్స్ ఉంటాయి. ఈ టోర్న‌మెంట్‌లో విజేత జ‌ట్టుకు రూ.30 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ఇస్తారు. సెకండ్ ప్లేస్ సాధించిన వారికి రూ.10 ల‌క్ష‌లు, 3వ ప్లేస్‌లో నిలిచిన వారికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తారు. ఇక టాప్ 10 లో నిలిచిన మిగిలిన వారికి కూడా ర్యాంక్‌ను బ‌ట్టి క్యాష్ ప్రైజ్‌లు ఉంటాయి. అయితే ఈ ప‌బ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 టోర్న‌మెంట్‌లో పాల్గొనాలంటే ముందుగా http://www.pubgmobile.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

5930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles