వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త ఫీచర్..!


Tue,August 7, 2018 07:00 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో పేరిట తొలుత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమకు వాట్సాప్‌లో వచ్చే ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలను వాట్సాప్ యాప్ క్లోజ్ చేయకుండానే అదే స్క్రీన్‌లో చిన్న విండోలో ఆ వీడియోలను చూడవచ్చు. కాగా ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇతర యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది.

3380

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles