ఇక వైఫై కాదు.. లైఫైని వాడుకోవాలి..!


Mon,March 19, 2018 03:19 PM

అవును, మీరు విన్నది నిజమే. ఇకపై మనం వైఫై కాదు, లైఫై (LiFi)ని వాడుకోవాలి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫిలిప్స్ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజాగా ఆవిష్కరించింది. దీంతో త్వరలో లైఫై టెక్నాలజీ మనకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సురక్షితమైన, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వీలుంటుంది.

లైఫై ఎలా పనిచేస్తుంది..?


వైఫై టెక్నాలజీ అంటే వైర్‌లెస్ తరంగాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. అయితే లైఫై కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. అంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎల్‌ఈడీ లైట్లలో మోడెమ్‌ను అమరుస్తారు. ఈ క్రమంలో లైట్లను ఆన్ చేసినప్పుడు ఆ మోడెమ్ నుంచి కాంతి తరంగాలు లైట్ల ద్వారా బయటకు వస్తాయి. ఇక స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు అమర్చబడిన ప్రత్యేకమైన యూఎస్‌బీ డాంగిల్ ఆ కాంతి తరంగాలను గుర్తించి వాటిని ఇంటర్నెట్ తరంగాలుగా మార్చి డివైస్‌లకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇలా లైఫై పనిచేస్తుంది.

లైఫై ఉపయోగాలు...


వైర్‌లెస్ తరంగాలు వాడేందుకు వీలుకాని చాలా వరకు ప్రదేశాల్లో లైఫైని సులభంగా వాడవచ్చు. దీంతోపాటు ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది. గోడల ద్వారా వైఫై బయటకు కూడా ప్రసారం అవుతుంది. కానీ లైఫై కేవలం ఒకే చోట ఉంటుంది. గోడల ద్వారా ప్రయాణించదు. దీంతో లైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇతరులు దాన్ని యాక్సెస్ చేయలేరు. కార్పొరేట్ కార్యాలయాల్లో, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్‌ను వాడితే అది సురక్షింగా ఉండడమే కాదు, సుస్థిరమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ఫిలిప్స్ ఆవిష్కరించిన ఈ లైఫై టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైన వినియోగానికి అందుబాటులోకి రానుంది.

6249

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles