పేటీఎం మాల్‌లో మహా క్యాష్‌బ్యాక్ సేల్


Tue,October 16, 2018 10:16 AM

దసరా పండుగ నేపథ్యంలో పేటీఎం మాల్ మరో ప్రత్యేక సేల్‌ను ఇవాళ నిర్వహిస్తున్నది. మహా క్యాష్‌బ్యాక్ సేల్ పేరిట ఇవాళ పేటీఎం మాల్ మరో సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుండగా ఇందులో అనేక ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. దుస్తులపై గరిష్టంగా 70 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. కంప్యూటర్ ఉత్పత్తులపై 25 శాతం క్యాష్‌బ్యాక్‌ను, గేమింగ్ కన్సోల్స్‌పై రూ.6వేల క్యాష్‌బ్యాక్‌ను, మెమొరీ కార్డులపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అలాగే గృహోపకరణాలపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు.

1872

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles