పేటీఎం మాల్ 2017 గ్రాండ్ ఫినాలే సేల్.. మొబైల్స్‌పై భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు..!


Wed,December 13, 2017 05:34 PM

పేటీఎం సంస్థ ఈ మధ్యే 12.12 సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు పేటీఎం మరో సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. 'పేటీఎం మాల్ 2017 గ్రాండ్ ఫినాలే సేల్‌'ను నిర్వహిస్తున్నది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా యాపిల్, లెనోవో, మోటోరోలా, శాంసంగ్, షియోమీ వంటి కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను పేటీఎం అందిస్తున్నది.

ఐఫోన్ 10 (64జీబీ)పై రూ.4వేలు, ఐఫోన్ 8 (64జీబీ)పై రూ.7,500, ఐఫోన్ 7 (32జీబీ)పై రూ.6,250, ఐఫోన్ ఎస్‌ఈ 32 జీబీ పై రూ.3వేల క్యాష్ బ్యాక్, వివో వీ7 ప్లస్‌పై రూ.1,100 క్యాష్‌బ్యాక్, లెనోవో కె8 (32జీబీ)పై రూ.1,243 క్యాష్‌బ్యాక్, మోటో జీ5ఎస్ 32జీబీ పై రూ.1,612 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ అందిస్తున్నది. దీంతోపాటు స్వైప్ కనెక్ట్ పవర్ 4జీ, స్వైప్ ఎలైట్ ప్రొ 32 జీబీ, స్వైప్ ఎలైట్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 6, ఇంటెక్స్ ఆక్వా ఎస్3 4జీ, ఐప్యాడ్ ప్రొ (వైఫై, సెల్యులార్ 32జీబీ), ఐప్యాడ్ మినీ 4 (వైఫై, సెల్యులార్ 16జీబీ) మోడల్స్‌పై కూడా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పేటీఎం అందిస్తున్నది.

4423

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles