రేపటి నుంచి పేటీఎం మాల్ మహా క్యాష్‌బ్యాక్ సేల్


Mon,October 8, 2018 03:32 PM

దసరా పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మరో రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సేల్‌లను నిర్వహించనున్న విషయం విదితమే. కాగా ఇదే కోవలోకి పేటీఎం వచ్చి చేరింది. పేటీఎం మాల్ స్టోర్‌లో పేటీఎం కూడా రేపటి నుంచి మహా క్యాష్‌బ్యాక్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకట్టుకునే రాయితీలు, ఆఫర్లను అందివ్వనున్నారు. సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అదనంగా ఇస్తారు.

పేటీఎం మహా క్యాష్‌బ్యాక్ సేల్‌లో ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్లాష్ సేల్స్, డీల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. అలాగే పలు ప్రొడక్ట్స్‌ను రూ.1 కే విక్రయిస్తారు. దీంతోపాటు రాత్రి 8 నుంచి అర్థరాత్రి వరకు పలు ప్రొడక్ట్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. సేల్‌లో భాగంగా పలు ఉత్పత్తులపై గరిష్టంగా రూ.12వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. అలాగే పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.21వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సేల్‌లో ఐఫోన్ Xపై రూ.12వేల క్యాష్‌బ్యాక్, వివో వి11 ప్రొ పై రూ.3వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఒప్పో ఎఫ్9 ప్రొపై రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

పేటీఎం సేల్‌లో ఫ్రిజ్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్, వాటర్ ప్యూరిఫైర్‌లపై రూ.10వేల క్యాష్‌బ్యాక్, మిక్సర్ గ్రైండర్‌లపై 25 శాతం క్యాష్‌బ్యాక్, బ్లూటూత్ స్పీకర్లపై రూ.2,250 క్యాష్‌బ్యాక్‌లను అందివ్వనున్నారు. వీటితోపాటు ఇంకా అనేక ఆకట్టుకునే ఆఫర్లను పేటీఎం తన మహా క్యాష్‌బ్యాక్ సేల్‌లో అందివ్వనుంది.

1313

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles