రూ.9099 చెల్లించండి.. గెలాక్సీ ఎస్10 సొంతం చేసుకోండి..!


Sat,February 23, 2019 04:27 PM

టెలికాం సంస్థ ఎయిర్ టెల్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఇటీవ‌లే నూత‌నంగా విడుద‌లైన గెలాక్సీ ఎస్10 ఫోన్ల‌ను సుల‌భ‌మైన ఈఎంఐ ప‌ద్ధ‌తిలో ఇస్తున్న‌ది. వినియోగ‌దారులు గెలాక్సీ ఎస్‌10 ఫోన్‌కు చెందిన 128 జీబీ, 512 జీబీ, గెలాక్సీ ఎస్10 ప్ల‌స్‌కు చెందిన 128 జీబీ వేరియెంట్ల‌ను ఈ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందుకు గాను గెలాక్సీ ఎస్10 128 జీబీ వేరియెంట్‌కు రూ.9,099, 512జీబీ వేరియెంట్‌కు రూ.13,809, గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్ 128 జీబీ వేరియెంట్ కు రూ.15,799 ల‌ను డౌన్ పేమెంట్ రూపంలో ముందుగా చెల్లించాలి. దీంతో ఈఎంఐ ప‌ద్ధ‌తిలో ఆ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు. అనంతరం మిగిలిన మొత్తాన్ని వినియోగ‌దారులు 24 నెలల్లోగా నెల‌కు రూ.2,999 చొప్పున‌ చెల్లించాల్సి ఉంటుంది. 512 జీబీ వేరియెంట్‌కైతే నెల‌కు రూ.3,499 చెల్లించాలి. ఈ క్ర‌మంలో వినియోగ‌దారులు త‌మ గెలాక్సీ ఎస్10 ఫోన్ల‌లో ఎయిర్ టెల్ పోస్టుపెయిడ్ సిమ్ వాడాల్సి ఉంటుంది. ఆ సిమ్‌లో ఉన్న ప్లాన్‌కు నెల‌కు 100 జీబీ డేటాను, ప‌లు ఇత‌ర బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్ అందిస్తుంది..!

3338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles