రూ.6,490కే పానాసోనిక్ పీ91 స్మార్ట్‌ఫోన్


Sat,November 18, 2017 02:07 PM

పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'పీ91'ను తాజాగా విడుదల చేసింది. రూ.6,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు. దీంతో ఈ ఫోన్‌లో ఒకే సారి రెండు సిమ్ కార్డులతోపాటు మెమొరీ కార్డును కూడా వేసి ఉపయోగించుకోవచ్చు.

పానాసోనిక్ పీ91 ఫీచర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

2649

More News

VIRAL NEWS