ల్యూమిక్స్ ఎస్‌1, ఎస్‌1ఆర్ కెమెరాల‌ను విడుద‌ల చేసిన పానాసోనిక్


Tue,April 16, 2019 12:04 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు పానాసోనిక్ భార‌త్‌లో ల్యూమిక్స్ ఎస్‌1, ఎస్‌1ఆర్ పేరిట రెండు నూత‌న డీఎస్ఎల్ఆర్ కెమెరాల‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ల్యూమిక్స్ ఎస్1లో 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేయ‌గా, ఎస్‌1ఆర్‌లో 47.3 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వీటితో హై రిజ‌ల్యూష‌న్ క‌లిగిన నాణ్య‌మైన ఫొటోలు తీసుకోవ‌చ్చు. అలాగే హై రిజ‌ల్యూష‌న్ ఉన్న వీడియోల‌ను కూడా ఈ కెమెరాతో రికార్డ్ చేయ‌వ‌చ్చు. వీటితోపాటు ప‌లు ఇత‌ర ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను కూడా ఈ కెమెరాల్లో అందిస్తున్నారు. ల్యూమిక్స్ ఎస్‌1 ధ‌ర రూ.1,99,990 ఉండ‌గా, ఎస్‌1ఆర్ కెమెరా ధ‌ర రూ.2,99,990 గా ఉంది.

618

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles