నిమిషాల వ్య‌వ‌ధిలోనే 2 ల‌క్ష‌ల రెడ్‌మీ నోట్ 7 ఫోన్ల అమ్మ‌కాలు..!


Fri,March 8, 2019 02:08 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ తాజాగా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌కు గాను ఈ నెల 6వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్స్‌ల‌లో మొద‌టి ఫ్లాష్ సేల్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆ సేల్‌లో కేవలం నిమిషాల వ్య‌వ‌ధిలోనే మొత్తం 2 ల‌క్ష‌ల రెడ్‌మీ నోట్ 7 ఫోన్ల‌ను విక్ర‌యించామ‌ని షియోమీ ఇండియా తెలిపింది. ఈ మేర‌కు ఆ కంపెనీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్టును ట్వీట్ చేసింది. ఇక ఈ ఫోన్‌కు గాను తదుప‌రి సేల్‌ను ఈ నెల 13వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నిర్వ‌హిస్తామ‌ని కూడా షియోమీ ఇండియా ట్వీట్ చేసింది.

రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

3546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles