మార్కెట్‌లోకి ఒట్టొమేట్ స్మార్ట్‌ఫ్యాన్‌.. ధ‌ర రూ.3,999...


Fri,March 8, 2019 12:26 PM

ఒట్టొమేట్ కంపెనీ భార‌త మార్కెట్‌లో తాజాగా ఓ నూత‌న స్మార్ట్‌ఫ్యాన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. దీని స‌హాయంతో ఈ ఫ్యాన్‌ను ఫోన్‌కు యాప్ ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే యాప్‌లో ఉన్న ఆప్ష‌న్ల‌ను ఉప‌యోగించుకుంటూ ఫ్యాన్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్‌లో ఒట్టొ మోడ్‌, బ్రీజ్ మోడ్‌, ట‌ర్బో మోడ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఫ్యాన్‌ను నిర్దిష్ట‌మైన స్పీడ్‌లో క్ర‌మ‌బ‌ద్దంగా తిరిగేలా కూడా సెట్ చేసుకోవ‌చ్చు. గ‌ది ఉష్ణోగ్ర‌త‌, తేమకు అనుగుణంగా ఫ్యాన్ తిరిగేలా యాప్‌లో సెట్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ ఫ్యాన్ రూ.3,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫ్యాన్‌ను కొన్న వినియోగ‌దారుల‌కు ఇన్‌స్టాలేష‌న్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

9602

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles