ఈ నెల 27న రియల్‌మి 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,September 24, 2018 03:34 PM

ఒప్పో 'రియల్‌మి 2 ప్రొ' స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 27వ తేదీన భారత్‌లో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా లభ్యం కానుంది. అయితే ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీని ధర రూ.15వేల నుంచి రూ.20వేల మధ్య ఉండవచ్చని సమాచారం. కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

రియల్‌మి2 ప్రొ ఫీచర్లు...


6.3 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 4350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1880

More News

VIRAL NEWS