ఒప్పో నుంచి ఆర్‌ఎక్స్17 ప్రొ స్మార్ట్‌ఫోన్


Thu,November 8, 2018 09:47 AM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్‌ఎక్స్17 ప్రొ ను యూరప్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. దీని సహాయంతో కేవలం 0.41 సెకన్ల వ్యవధిలోనే డివైస్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో సూపర్ వూక్ ఫ్లాష్ చార్జ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ 0 నుంచి 40 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. రేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.49వేల ధరకు వినియోగదారులకు ఈ నెల 16వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ ఫీచర్లు...


6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిగ్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1175

More News

VIRAL NEWS