ఒప్పో నుంచి ఆర్‌ఎక్స్17 నియో స్మార్ట్‌ఫోన్


Thu,November 8, 2018 01:17 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్‌ఎక్స్17 నియోను తాజాగా యూరప్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రూ.29,040 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు నవంబర్ 16వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఆర్‌ఎక్స్17 నియో ఫీచర్లు...


6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.

740

More News

VIRAL NEWS