అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్


Tue,May 15, 2018 02:39 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో, ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లు కలిసి సంయుక్తంగా 'రియల్‌మి' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ఇదివరకే లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ బ్రాండ్ పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో, అమెజాన్‌లు ఇవాళ విడుదల చేశాయి. 'రియల్‌మి 1' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఆ రెండు సంస్థలు లాంచ్ చేశాయి. రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

రియల్‌మి 1 ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేనందున ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డులు వేసుకునే విధంగా మూడు వేర్వేరు డెడికేటెడ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న 3410 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల ఫోన్ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది.

3/4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ సిల్వర్, డైమండ్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తుండగా వీటి ధరలు వరుసగా రూ.8,990, రూ.10,990, రూ.13,990గా ఉన్నాయి. ఫోన్‌తోపాటు బాక్స్‌లో ఉచితంగా స్క్రీన్ గార్డ్‌ను అందిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా లభ్యం కానుంది.

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

3426

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles