40 రోజుల్లోనే 4 లక్షలు అమ్ముడైన రియల్‌మి 1 ఫోన్లు


Sat,July 21, 2018 08:17 PM

ఒప్పో, అమెజాన్ ఇండియాలు సంయుక్తంగా కలిసి రియల్‌మి 1 అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ అమ్మకాలు గణనీయంగా సాగాయి. మే నెలలో విడుదలైన ఈ ఫోన్ కేవలం 40 రోజుల్లోనే 4 లక్షల యూనిట్ల వరకు అమ్ముడైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఈ గణాంకాలను నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు విశేష రీతిలో స్పందన వస్తున్నది. అందుకే ఆ స్థాయిలో రియల్‌మి 1 ఫోన్ల అమ్మకాలు జరిగాయని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు.

ప్రస్తుతం రియల్‌మి1 ఫోన్ అమెజాన్ ఇండియా సైట్‌లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ర్యాంకింగ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. గత రెండు నెలలుగా అమెజాన్ సైట్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించిన ఫోన్‌గా కూడా రియల్‌మి 1 రికార్డుకెక్కింది. ఇందులో 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లను అందిస్తున్నారు. దాదాపుగా అన్ని వేరియెంట్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ ఫోన్ డైమండ్ బ్లాక్, మూన్ లైట్ సిల్వర్, సోలార్ రెడ్ వేరియెంట్లలో రూ.8,990 ప్రారంభ ధరకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

9987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles