ఈ నెల 18న ఒప్పో రియల్ మి 1 కొత్త వేరియెంట్ విడుదల


Wed,June 13, 2018 08:12 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన రియల్ మి 1 స్మార్ట్‌ఫోన్‌కు గాను మూన్‌లైట్ సిల్వర్ స్పెషల్ వేరియెంట్‌ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌కు చెందిన డైమండ్ బ్లాక్, సోలార్ రెడ్ కలర్ వేరియెంట్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉండగా కొత్త వేరియెంట్ కూడా అమెజాన్‌లోనే లభ్యం కానుంది. కానీ రియల్ మి 1 మూన్‌లైట్ సిల్వర్ వేరియెంట్‌ను లిమిటెడ్ ఎడిషన్ రూపంలోనే విక్రయించనున్నారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే గతంలో విడుదలైన రియల్ మి 1 లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఉన్నాయి. వాటిలో మార్పేమీ లేదు. కాగా రియల్ మి 1 మూన్‌లైట్ సిల్వర్ వేరియెంట్ ధరను రూ.10,990 గా నిర్ణయించారు.

రియల్ మి 1 ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

3069

More News

VIRAL NEWS