అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఒప్పో ఆర్17 స్మార్ట్‌ఫోన్


Thu,August 23, 2018 07:41 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 ను ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మాత్రమే ఈ ఫోన్ విడుదలైంది. భారత్‌లో ఈ ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. ఇక ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.32,620, రూ.35,600 ధరలకు వినియోగదారులకు ఈ నెల 30వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఆర్17 ఫీచర్లు...


6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

6494

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles