ఒప్పో ఆర్17 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sat,August 25, 2018 12:29 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 ప్రొ ను తాజాగా విడుదల చేసింది. రూ.43,830 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో ఆర్17 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కేవలం 0.41 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను అమర్చారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లో ఉన్న 3700 ఎంఏహెచ్ బ్యాటరీకి సూపర్ వూక్ ఫ్లాష్ చార్జ్ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ కేవలం 10 నిమిషాలలోనే 0 నుంచి 40 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది.

ఒప్పో ఆర్17 ప్రొ ఫీచర్లు...


6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్.

2306

More News

VIRAL NEWS