ఒప్పో నుంచి ఆర్17 నియో స్మార్ట్‌ఫోన్


Sun,November 4, 2018 06:31 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 నియో ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. రూ.25,500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

ఒప్పో ఆర్17 నియో ఫీచర్లు...

6.4 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.

4421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles