భారత్‌లో విడుదలైన ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్..


Sat,July 20, 2019 03:35 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె3 ని గతంలో చైనా మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఇవాళ ఒప్పో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.16,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.19,990గా ఉంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో విక్రయించనున్నారు.

ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles