ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Mon,May 27, 2019 04:22 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఒప్పో కె3 ని తాజాగా చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అమ‌ర్చారు. స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ పాపప్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్ రూ.16,105 ప్రారంభ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు జూన్ 2వ వారం నుంచి ల‌భ్యం కానుంది.

ఒప్పో కె3 ఫీచ‌ర్లు...


6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles