రియల్ మి 2, రియల్ మి సి1 ఫోన్ల ధరలను పెంచిన ఒప్పో


Wed,November 7, 2018 01:25 PM

ఒప్పో తన రియల్ మి సబ్‌బ్రాండ్ కింద ఇప్పటి వరకు రియల్ మి1, రియల్ మి సి1, రియల్ మి2, రియల్ మి2 ప్రొ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు వినియోగదారుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇటీవలే విడుదలైన రియల్ మి 2, రియల్ మి సి1 ఫోన్ల ధరలను పెంచినట్లు ఒప్పో తెలిపింది.

రియల్ మి 2 కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,990 ఉండగా, పెరిగిన ధర తరువాత ఇప్పుడీ ఫోన్ రూ.9,499 ధరకు లభిస్తున్నది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,990 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్నది. ఇక రియల్ మి సి1 ఫోన్ ధర రూ.6,999 ఉండగా, దీని ధరను రూ.1వేయి పెంచారు. దీంతో ఇప్పుడీ ఫోన్ వినియోగదారులకు రూ.7,999 ధరకు లభిస్తున్నది.

2635

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles