అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఒప్పో ఫైండ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Sat,July 14, 2018 03:33 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.42 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ భారీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు క్వాలిటీని కలిగి ఉంటాయి. ముందు కెమెరాకు 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కల్పించారు. ఈ కెమెరాకు అనుబంధంగా ఉండే 3డీ స్ట్రక్చర్డ్ లైట్ టెక్నాలజీ యూజర్ ముఖంలో ఉన్న 15వేల పాయింట్లను గుర్తించి ఫీడ్ చేసుకుంటుంది. దీని వల్ల కేవలం యూజర్ ముఖంతోనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఫొటోతో ఫోన్‌ను అన్‌లాక్ చేయలేరు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో యాపిల్ యానిమోజీ తరహాలో 3డీ ఒమోజీని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉండే కెమెరాతో యూజర్లు తీసుకునే ఫొటోలను ఒమోజీలుగా మార్చుకోవచ్చు. ఇక ఫోన్‌ను పూర్తిగా 3డీ గ్లాస్ బాడీతో రూపొందించారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను దీనికి ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న బ్యాటరీ వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. అందువల్ల డివైస్ ఫుల్ చార్జింగ్ అయ్యేందుకు చాలా తక్కువ సమయం పడుతుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ బోర్డిక్స్ రెడ్, గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధరను రూ.59,990 గా నిర్ణయించారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తారు. ఆగస్టు 3వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 25 నుంచి ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ చేసుకునే వారికి రూ.3వేల విలువైన గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తారు. ఇక ఇదే ఫోన్‌కు గాను లంబోర్గిని ఎడిషన్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ఒప్పో ఇండియా ప్రకటించింది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు...

6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేస్ అన్‌లాక్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.

2979

More News

VIRAL NEWS