అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఒప్పో ఎఫ్9 స్మార్ట్‌ఫోన్


Thu,August 16, 2018 03:48 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎఫ్9 ను వియత్నాం, ఫిలిప్పీన్స్ మార్కెట్‌లలో తాజాగా విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీన భారత్‌లో ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.23,290 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఒప్పో ఎఫ్9 స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పవర్‌ఫుల్ క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అమర్చారు.

ఒప్పో ఎఫ్9 ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

2179

More News

VIRAL NEWS

Featured Articles