ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్‌ఫోన్


Wed,August 22, 2018 12:23 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎఫ్9 ప్రొ ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో వీవోవోసీ ఫ్లాష్ చార్జ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను కేవలం 5 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 2 గంటల పాటు మాట్లాడుకునేందుకు అవసరమైన చార్జింగ్ వస్తుంది. అలాగే ఈ ఫోన్ లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

వన్ టైం డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్, 3డీ మెటాలిక్ బాటిల్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ తదితర ఆఫర్లను ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి అందిస్తున్నారు. సన్‌రైజ్ రెడ్, ట్విలైట్ బ్లూ, స్టారీ పర్పుల్ కలర్ వేరియెంట్లలో రూ.23,990 ధరకు ఒప్పో ఎఫ్9 ప్రొ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

ఒప్పో ఎఫ్9 ప్రొ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ న్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జ్.

919

More News

VIRAL NEWS