ఒప్పో ఎఫ్11 ప్రొ అవెంజ‌ర్స్ ఎడిష‌న్‌.. ఈ నెల 24న విడుద‌ల‌..


Mon,April 15, 2019 06:39 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న ఎఫ్11 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను గ‌త నెల‌లో విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్‌కు గాను ఈ నెల 24వ తేదీన మార్వెల్స్ అవెంజ‌ర్స్ లిమిటెడ్ ఎడిష‌న్‌ను ఒప్పో విడుద‌ల చేయ‌నుంది. మార్వెల్ సంస్థ‌తో భాగ‌స్వామ్య‌మైన ఒప్పో ఈ ఎడిష‌న్‌ను ప్ర‌త్యేకంగా విడుద‌ల చేస్తున్న‌ది. ఈ నెల 26వ తేదీన అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీ రిలీజ్ అవ‌నున్న నేప‌థ్యంలో ఒప్పో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్న‌ది. కాగా ఈ ఫోన్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో ల‌భిస్తుంది.

ఒప్పో ఎఫ్11 ప్రొ ఫోన్‌లో 6.5 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వూక్ ఫ్లాష్ చార్జ్ 3.0 త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఈ అవెంజ‌ర్స్ ఎడిష‌న్ వేరియెంట్ ధ‌ర‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

1203

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles