ఒప్పో నుంచి ఎ7 స్మార్ట్‌ఫోన్


Sat,November 17, 2018 02:27 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ7 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4230 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఫ్రెష్ పింక్, లేక్ గ్రీన్, యాంబర్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.16,540 ధరకు వినియోగదారులకు ఈ నెల 22వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఎ7 ఫీచర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

729

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles