ఒప్పో ఎ3ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,July 15, 2018 12:22 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ3ఎస్ ను తాజాగా విడుదల చేసింది. రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 4230 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు.

ఒప్పో ఎ3ఎస్ ఫీచర్లు...


6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

2962

More News

VIRAL NEWS

Featured Articles