బిల్టిన్ ఉచిత వీపీఎన్‌తో విడుద‌లైన ఒపెరా బ్రౌజ‌ర్ కొత్త వెర్ష‌న్


Sun,February 10, 2019 03:40 PM

వీపీఎన్ ఫీచ‌ర్ ఇన్‌బిల్ట్‌గా ఉన్న కొత్త ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ ను ఒపెరా తాజాగా విడుద‌ల చేసింది. అయితే ఈ బ్రౌజ‌ర్ ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లోనే ఉంది. కానీ దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. యూజ‌ర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఉన్న వీపీఎన్ ఫీచ‌ర్‌ను ఉచితంగానే ఉపయోగించుకోవ‌చ్చు. కాగా యూజ‌ర్లు వెబ్‌సైట్ల‌ను బ్రౌజ్ చేసేట‌ప్పుడు వీపీఎన్ ఆన్ చేసుకుంటే వారికి మ‌రింత ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని ఒపెరా తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఆ బ్రౌజ‌ర్‌లో ఉండే వీపీఎన్ యూజ‌ర్ల‌కు చెందిన అస‌లు ఐపీ అడ్ర‌స్‌ను దాచి పెట్టి దానికి బ‌దులుగా వ‌ర్చువ‌ల్ ఐపీ అడ్ర‌స్‌ను యాక్టివ్ చేస్తుంది. దీంతో అవ‌త‌లి వారికి యూజ‌ర్‌కు చెందిన అస‌లు ఐపీ అడ్ర‌స్ తెలియ‌దు. దీని వ‌ల్ల ఫోన్ల‌లో నెట్‌బ్రౌజింగ్ చేసేట‌ప్పుడు హ్యాకర్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. అయితే వీపీఎన్ క‌లిగిన ఈ నూత‌న ఒపెరా బ్రౌజ‌ర్ ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి వెర్ష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

1311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles