మూడు కొత్త ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించనున్న వన్‌ప్లస్


Mon,July 23, 2018 07:07 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ త్వరలో మూడు కొత్త ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించనుంది. బెంగళూరు, ముంబై, కోల్‌కతాలలో ఈ నెల 28వ తేదీన వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నారు. బెంగుళూరులో జయానగర్ 4వ బ్లాక్‌లో, ముంబై సెంట్రల్ మాల్‌లో, కోల్‌కతా సౌత్ సిటీ మాల్‌లో ఈ స్టోర్స్ ప్రారంభమవుతాయి. ఇక వీటి ప్రారంభం సందర్భంగా వన్‌ప్లస్ తన కస్టమర్లకు పలు ఆఫర్లను అందిస్తున్నది. oneplus.in/retail-stores అనే సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే సదరు స్టోర్స్‌లో ముందుగా వచ్చే 100 మంది కస్టమర్లకు వన్‌ప్లస్ 6ఎక్స్ మార్వెల్ అవెంజర్స్ ఐరన్ మ్యాన్ కేస్‌తోపాటు వన్‌ప్లస్ బ్రాండెడ్ టీషర్ట్‌లను ఉచితంగా అందిస్తుంది.

2017 జనవరిలో బెంగళూరులో వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ ఓపెనింగ్ ద్వారా ఆ ప్రాంతంలో వన్‌ప్లస్ ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఇక గతంలో వచ్చిన వన్‌ప్లస్ 5తో పోలిస్తే వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు గాను స్టోర్స్‌లో 91 శాతం సేల్స్ పెరిగాయి. అందువల్లే దేశ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ప్రారంభించాలని వన్‌ప్లస్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది జనవరిలో ముంబైలోని పార్లే వెస్ట్‌లో ఉన్న ప్రైమ్ మాల్‌లోనూ వన్ ప్లస్ తన ఆథరైజ్డ్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతోనే కొత్తగా మరిన్ని స్టోర్స్‌ను ఓపెన్ చేయడం జరుగుతుందని వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ తెలిపారు.

2675

More News

VIRAL NEWS