ఇకపై వన్‌ప్లస్ టీవీలు.. మొదట భారత్‌లోనే విడుదల..!


Thu,August 22, 2019 11:13 AM

చైనాకు చెందిన ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ త్వరలో వన్‌ప్లస్ 4కె అల్ట్రాహెచ్‌డీ స్మార్ట్‌టీవీలను విడుదల చేయనుంది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే టీవీలను తయారు చేస్తున్నామని వన్‌ప్లస్ ప్రకటించగా, గత వారం కిందట వన్‌ప్లస్ టీవీ ప్రొడక్ట్‌కు చెందిన లోగోనుఆ కంపెనీ ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో వన్‌ప్లస్ టీవీలను విడుదల చేస్తామని, మొదటగా భారత్‌లోనే ఈ టీవీలను విడుదల చేయనున్నామని ఆ కంపెనీ తెలిపింది.

కాగా వన్‌ప్లస్ టీవీలు అన్నీ 4కె అల్ట్రాహెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అలాగే గూగుల్‌కు చెందిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఆ టీవీలలో అందిస్తారని సమాచారం. ఇక అవి శాంసంగ్ అందించే తరహాలోనే క్యూలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. కాగా వన్‌ప్లస్ టీవీలు 43, 55, 65, 75 ఇంచుల సైజులలో విడుదల కానున్నాయని తెలిసింది. ఇక ఈ టీవీలకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో తెలియనుంది..!

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles