వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ ఫోన్‌ను విడుద‌ల చేసిన వ‌న్‌ప్ల‌స్


Wed,May 15, 2019 03:09 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న వ‌న్‌ప్ల‌స్ ఫోన్లు.. వ‌న్ ప్ల‌స్ 7, 7ప్రొల‌ను నిన్న విడుద‌ల చేసిన విష‌యం విదితమే. కాగా ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌లో మాత్ర‌మే ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్లో వ‌న్‌ప్ల‌స్ 7 లోని ఫీచ‌ర్ల‌నే ఏర్పాటు చేశారు. కాక‌పోతే 5జీ కోసం ప్ర‌త్యేకంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌50 5జీ మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ ఫోన్ త్వ‌ర‌లో యూకేలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది. ఇక దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో విడుద‌ల చేసే ఆలోచ‌న‌పై వ‌న్‌ప్ల‌స్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..!

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles