అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్


Tue,October 30, 2018 10:15 AM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టి ని నిన్న రాత్రి విడుదల చేసింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.41 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను దీనికి అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

వన్‌ప్లస్ 6టి ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. కాగా తొలిసారిగా వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. దీంతో కేవలం 0.34 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్‌ను పూర్తిగా తీసేశారు. అందువల్ల యూఎస్‌బీ టైప్ సి పోర్టుకే ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని ఆడియో వినాల్సి ఉంటుంది.

వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ మిర్రర్ బ్లాక్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ మోడల్స్‌లో విడుదల కాగా, ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 549 డాలర్లు (దాదాపుగా రూ.40,290)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 579 డాలర్లు (దాదాపుగా రూ.42,490)గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 629 డాలర్లు (దాదాపుగా రూ.46,160)గా ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను యూరప్ మార్కెట్‌లో విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లభ్యమయ్యేది, ధర ఇతర వివరాలను మాత్రం వన్ ప్లస్ వెల్లడించలేదు..!

వన్ ప్లస్ 6టి ఫీచర్లు...


6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1903

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles