వన్ ప్లస్ 6టి ఫోన్ ప్రీఆర్డర్‌తో ఉచితంగా ఇయర్‌ఫోన్లు..!


Sun,October 14, 2018 01:38 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టిని ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. ఆ రోజున న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఈవెంట్‌లో వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను విడుదల చేయనున్నారు. అదే రోజున ఢిల్లీలో రాత్రి 8.30 గంటలకు నిర్వహించే ఈవెంట్‌లో భారత్‌లోనూ వన్‌ప్లస్ 6టి ని అధికారికంగా లాంచ్ చేస్తారు. అయితే వన్‌ప్లస్ 6టి ఫోన్‌కు గాను ఇప్పటికే అమెజాన్ సైట్‌లో ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా, ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేసే వారికి వన్‌ప్లస్ పలు ఆఫర్లను అందిస్తున్నది.

అమెజాన్ లేదా వన్‌ప్లస్ స్టోర్‌లో వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ.500 విలువ గల అమెజాన్ పే కూపన్‌ను ఇస్తారు. అలాగే వన్‌ప్లస్ యూఎస్‌బీ టైప్ సి బుల్లెట్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా ఉచితంగా ఇస్తారు. అందుకు వినియోగదారులు ఏం చేయాలంటే... అమెజాన్ సైట్‌లోకి వెళ్లి వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను రూ.1000 చెల్లించి ప్రీ ఆర్డర్ చేయాలి. దీంతో యూజర్ మెయిల్‌కు గిఫ్ట్ కార్డ్ వస్తుంది. అనంతరం నవంబర్ 2 లేదా 3వ తేదీల్లో ఉండే సేల్‌లో వన్‌ప్లస్ 6టిని కొనుగోలు చేయాలి. దీంతో అమెజాన్ పే లో రూ.500 బ్యాలెన్స్ వస్తుంది. నవంబర్ 6న ఈ మొత్తం యూజర్‌కు క్రెడిట్ అవుతుంది. అలాగే మెయిల్‌కు వచ్చే కూపన్ కోడ్‌ను ఉపయోగించి ఉచితంగా వన్‌ప్లస్ యూఎస్‌బీ టైప్ సి బుల్లెట్ ఇయర్‌ఫోన్స్‌ను పొందవచ్చు. నవంబర్ 15లోగా కూపన్‌ను వాడుకోవాల్సి ఉంటుంది.

15509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles